Buy from Amazon
Friday, August 07, 2015
Monday, March 23, 2015
చిట్టి
నా స్నేహితుడు పేరు చిట్టి
వాడి బుర్రలో ఉంది వట్టి మట్టి
వాడు చదివాడు పరీక్షకు బట్టి పట్టి
చివరకు పాసయ్యాడు కాపీ కొట్టి
వాడి బుర్రలో ఉంది వట్టి మట్టి
వాడు చదివాడు పరీక్షకు బట్టి పట్టి
చివరకు పాసయ్యాడు కాపీ కొట్టి
Tuesday, August 13, 2013
Thursday, May 23, 2013
నాలుక ఉపకారం
పళ్ళు నములుతుంటే నాలుక పళ్ళ కిందకి తోస్తుంటుంది. పళ్ళు నములుతాయి. నాలుక వివిధ రుచులను చూస్తుంది. "మీరు పదార్దలన్నింటిని ఎంత కఠిన మైనా నేను తోస్తుంటే మీరు నములుతున్నారు. నన్ను నలిపేయట్లేదు. ఇంత ఉపకారం చేస్తున్నారు కదా, నేను కూడా మీకు ఏదైనా ఉపకారం చేస్తాను. ఎం కావాలో చెప్పండి" అంది నాలుక. 32 పళ్ళు కలిసి నాలుకతో ఇలా అన్నాయి. నువ్వు మాకు చేయగలిగే ఉపకారం ఒక్కటే. నీకు తోచినట్టు నువ్వు మాట్లాడకు. మాట జారేది నువ్వు, పళ్ళు రాలిపోతాయి అని మమ్మల్ని అంటారు. అందుకని నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడకు. అదే నువ్వు మాకు చేసే ఉపకారం.
Source: Sri Chaganti Pravachanalu
Source: Sri Chaganti Pravachanalu
Friday, March 08, 2013
తిరుమల శిలాతోరణం
నేను ఈ మద్య తిరుమల వెళ్ళినప్పుడు, వెంకన్న స్వామివారి దర్శనం అయిన తర్వాత TTD museum కి వెళ్ళాను. అక్కడ ఉన్న చిత్రపటాలు చూస్తుండగా, తిరుమల లోని శిలాతోరణం యొక్క చిత్రపటం కంటపడింది. దాని మీద శిలాతోరణం యొక్క విశిష్టత గురించి వ్రాయబడి ఉంది. దాని ప్రకారం, శిలాతోరణం మీద పురాతత్వ శాస్త్రజ్ఞులు కొన్ని పరిశోదనలు జరిపి, ఆ శిలలు వయసు సుమారు 250 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా వేశారు. ఆ శిలలు తోరణంగా ఏర్పడి 160 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగం లో మొట్ట మొదటి సారిగా ఈ భూమి మీద అడుగు పెట్టింది కూడా ఈ శిలాతోరణం వద్దనే అని ఒక కథ కూడా ఉంది. ఇదంతా చదివిన తర్వాత శిలాతోరణం చూడడానికి వెళ్ళాను. శిలాతోరణంని చూడగానే, ఈ శిలాతోరణం అన్ని యుగ చక్రాలను చూసి వుంటుందో కదా అని అనిపించింది. ఒక యుగం సుమారు 4 లక్షల సంవత్సరాలు అనుకున్నా, ఈ శిలాతోరణం ఎన్ని యుగాలను, ప్రళయాలను,సృష్టి మరియు అద్భుతాలను చూసి వుంటుందో! ఈ శిలాతోరణంకే గాని ఒక భాష వుండి ఉంటే, ఆ భాష మనకి కూడా అర్ధం అయితే, ఒక తాతగారి అనుభవాలను మనవడు పంచుకున్నట్లు, ఈ శిలాతోరణం వద్ద విషయాలను తెలుసుకోవడం ప్రారంబిస్తే, మన ఈ జీవిత కాలం కూడా సరిపోదేమో!
Subscribe to:
Posts (Atom)