Buy from Amazon

Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Tuesday, March 02, 2021

చేతనయితే భుజం తట్టు

చేతనయితే భుజం తట్టు
ధైర్యం ఉంటే ఒక దెబ్బ కొట్టు
బలం ఉంటే ఒక పట్టు పట్టు
లేదంటే చేతులు కట్టు!

-- ఆనంద్

Monday, February 11, 2019

చరిత్ర కెక్కాలి మన గాథ

నుదిటి మీద బ్రహ్మ రాత
చేతిలోని మన గీత
చిత్రగుప్తుని వద్ద మన ఖాత
ఇవి తెలేలోపే చరిత్ర కెక్కాలి మన గాథ.


-- ఆనంద్

Monday, March 23, 2015

చిట్టి

నా స్నేహితుడు పేరు చిట్టి
వాడి బుర్రలో ఉంది వట్టి మట్టి
వాడు చదివాడు పరీక్షకు బట్టి పట్టి
చివరకు పాసయ్యాడు కాపీ కొట్టి

Tuesday, August 13, 2013

దేవుడి అమ్మ

దేవుని గుడిలో
అమ్మ ఒడిలో
మౌనంగా ఉంటేనే అందం
మనకి ఏం కావాలో వారికి తెలుసు

Thursday, May 23, 2013

నాలుక ఉపకారం

పళ్ళు నములుతుంటే నాలుక పళ్ళ కిందకి తోస్తుంటుంది. పళ్ళు నములుతాయి. నాలుక వివిధ రుచులను చూస్తుంది. "మీరు పదార్దలన్నింటిని ఎంత కఠిన మైనా నేను తోస్తుంటే మీరు నములుతున్నారు. నన్ను నలిపేయట్లేదు. ఇంత ఉపకారం చేస్తున్నారు కదా, నేను కూడా మీకు ఏదైనా ఉపకారం చేస్తాను. ఎం కావాలో చెప్పండి" అంది నాలుక. 32 పళ్ళు కలిసి నాలుకతో ఇలా అన్నాయి. నువ్వు మాకు చేయగలిగే ఉపకారం ఒక్కటే. నీకు తోచినట్టు నువ్వు మాట్లాడకు. మాట జారేది నువ్వు, పళ్ళు రాలిపోతాయి అని మమ్మల్ని అంటారు. అందుకని నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడకు. అదే నువ్వు మాకు చేసే ఉపకారం.


Source: Sri Chaganti Pravachanalu

Friday, March 08, 2013

తిరుమల శిలాతోరణం

నేను ఈ మద్య తిరుమల  వెళ్ళినప్పుడు, వెంకన్న స్వామివారి దర్శనం అయిన తర్వాత TTD museum కి వెళ్ళాను. అక్కడ ఉన్న చిత్రపటాలు చూస్తుండగా, తిరుమల లోని శిలాతోరణం యొక్క చిత్రపటం కంటపడింది. దాని మీద శిలాతోరణం యొక్క విశిష్టత గురించి వ్రాయబడి ఉంది. దాని ప్రకారం, శిలాతోరణం మీద పురాతత్వ శాస్త్రజ్ఞులు కొన్ని పరిశోదనలు జరిపి, ఆ శిలలు వయసు సుమారు 250 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా వేశారు. ఆ శిలలు తోరణంగా ఏర్పడి 160 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగం లో మొట్ట మొదటి సారిగా ఈ భూమి మీద అడుగు పెట్టింది కూడా ఈ శిలాతోరణం వద్దనే అని ఒక కథ కూడా ఉంది. ఇదంతా చదివిన తర్వాత శిలాతోరణం చూడడానికి వెళ్ళాను. శిలాతోరణంని చూడగానే, ఈ శిలాతోరణం అన్ని యుగ చక్రాలను చూసి వుంటుందో కదా అని అనిపించింది. ఒక యుగం సుమారు 4 లక్షల సంవత్సరాలు అనుకున్నా, ఈ శిలాతోరణం ఎన్ని యుగాలను, ప్రళయాలను,సృష్టి మరియు అద్భుతాలను చూసి వుంటుందో! ఈ శిలాతోరణంకే గాని ఒక భాష వుండి ఉంటే, ఆ భాష మనకి కూడా అర్ధం అయితే, ఒక తాతగారి అనుభవాలను మనవడు పంచుకున్నట్లు, ఈ శిలాతోరణం వద్ద విషయాలను తెలుసుకోవడం ప్రారంబిస్తే, మన ఈ జీవిత కాలం కూడా సరిపోదేమో!

Thursday, November 15, 2012

హృదయం మిన్న

మాటలాడే పెదవులు కన్నా
సాయం చేసే చేతులు మిన్న
ప్రేమను చెప్పే పదాలు కన్నా
ప్రేమను పంచే హృదయం మిన్న

--   ఆనంద్ 

Friday, February 03, 2012

Bala murali Krishna

I have listened E-TV Jummandhi Nadam episodes in Youtube. Interview with Bala murali Krishna, is one of them. I like a poem which he told in the interview.


అన్నమునకు ఆంధ్రము,
ఆదరణకు అరవము,
కన్నడకు కనడమూ,
మరులు కొలుపు మళయాళము!
మనమంతా ఒకటైతే,
బ్రతుకంతా, ప్రశాంతము.

Monday, September 06, 2010

Happy Teachers Day

గురువు,
మనకి అక్షరాభ్యాసం చేయించేది మన తల్లిదండ్రులే అయినా, అక్షరాలని అభ్యసింపఙేసేది మాత్రం గురువే. తల్లిదండ్రుల భాద్యతని తనొక్కడే తీసుకొని, మనల్ని తీర్చిదిద్దేవాడే గురువు. తల్లి-తండ్రి-గురువు-దైవం అన్నారు పెద్దలు. దైవం కన్నా, గురువే గొప్పవాడు. అన్ని దానాల కన్నా, విద్యాదానం గొప్పది కదా!

"గురుర్ భ్రహ్మ, గురుః విశ్ణుః,
గురుదేవో మహేశ్వరః,
గురుసాక్శాత్ పరభ్రహ్మః,
తస్మైత్ శ్రీ గురువేనమః."

"గురువు" స్తానం పూఙించదగినది.

అటువంటి గురువులందరికి,
Happy Teachers Day.

Sunday, August 01, 2010

Happy Friendship Day

"స్నేహాన్ని పువ్వుతొ పోల్చకు, వాడిపోతుంది,
మంచుతొ పోల్చకు, కరిగి పోతుంది,
ఆకుతొ పోల్చకు, రాలిపోతుంధి,
నీ నవ్వుతొ పోల్చు, శాశ్వతంగా ఉంటుంది."

Sunday, July 25, 2010

My First Post

Hi Friends,

This is my first post in my blog.
I want to start my blog with a message which I wanted to tell to my friend when she was leaving me for her better future. Unfortunately, I could’t say it to her. I share that message with you.



" ఓ నేస్తం ! నీ స్నేహభావంతో నాలో నీ స్నేహంని నింపి, స్నేహమాధుర్యాన్ని రుచి చూపించావ్.
ఒంటరిగా సాగుతున్న ఎడారిలాంటి నా జీవితంలొ ఒయాసిస్సువైనావు.

స్నేహ సౌందర్యాన్ని నాకు అందించిన నా నేస్తానికి ఇవే నా శుభాభినందనములు.

నిన్ను బాదించిన క్శణాన నన్ను మన్నించిన నా నేస్తం, ఈ క్శణాన నీ మన్ననను కోరుకుంటున్న ఈ నేస్తాన్ని ఎన్నటికీ మరవకు. "