Buy from Amazon

Tuesday, August 13, 2013

దేవుడి అమ్మ

దేవుని గుడిలో
అమ్మ ఒడిలో
మౌనంగా ఉంటేనే అందం
మనకి ఏం కావాలో వారికి తెలుసు

Thursday, May 23, 2013

నాలుక ఉపకారం

పళ్ళు నములుతుంటే నాలుక పళ్ళ కిందకి తోస్తుంటుంది. పళ్ళు నములుతాయి. నాలుక వివిధ రుచులను చూస్తుంది. "మీరు పదార్దలన్నింటిని ఎంత కఠిన మైనా నేను తోస్తుంటే మీరు నములుతున్నారు. నన్ను నలిపేయట్లేదు. ఇంత ఉపకారం చేస్తున్నారు కదా, నేను కూడా మీకు ఏదైనా ఉపకారం చేస్తాను. ఎం కావాలో చెప్పండి" అంది నాలుక. 32 పళ్ళు కలిసి నాలుకతో ఇలా అన్నాయి. నువ్వు మాకు చేయగలిగే ఉపకారం ఒక్కటే. నీకు తోచినట్టు నువ్వు మాట్లాడకు. మాట జారేది నువ్వు, పళ్ళు రాలిపోతాయి అని మమ్మల్ని అంటారు. అందుకని నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడకు. అదే నువ్వు మాకు చేసే ఉపకారం.


Source: Sri Chaganti Pravachanalu

Friday, March 08, 2013

తిరుమల శిలాతోరణం

నేను ఈ మద్య తిరుమల  వెళ్ళినప్పుడు, వెంకన్న స్వామివారి దర్శనం అయిన తర్వాత TTD museum కి వెళ్ళాను. అక్కడ ఉన్న చిత్రపటాలు చూస్తుండగా, తిరుమల లోని శిలాతోరణం యొక్క చిత్రపటం కంటపడింది. దాని మీద శిలాతోరణం యొక్క విశిష్టత గురించి వ్రాయబడి ఉంది. దాని ప్రకారం, శిలాతోరణం మీద పురాతత్వ శాస్త్రజ్ఞులు కొన్ని పరిశోదనలు జరిపి, ఆ శిలలు వయసు సుమారు 250 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా వేశారు. ఆ శిలలు తోరణంగా ఏర్పడి 160 కోట్ల సంవత్సరాలు పైగా ఉండవచ్చు అని అంచనా. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగం లో మొట్ట మొదటి సారిగా ఈ భూమి మీద అడుగు పెట్టింది కూడా ఈ శిలాతోరణం వద్దనే అని ఒక కథ కూడా ఉంది. ఇదంతా చదివిన తర్వాత శిలాతోరణం చూడడానికి వెళ్ళాను. శిలాతోరణంని చూడగానే, ఈ శిలాతోరణం అన్ని యుగ చక్రాలను చూసి వుంటుందో కదా అని అనిపించింది. ఒక యుగం సుమారు 4 లక్షల సంవత్సరాలు అనుకున్నా, ఈ శిలాతోరణం ఎన్ని యుగాలను, ప్రళయాలను,సృష్టి మరియు అద్భుతాలను చూసి వుంటుందో! ఈ శిలాతోరణంకే గాని ఒక భాష వుండి ఉంటే, ఆ భాష మనకి కూడా అర్ధం అయితే, ఒక తాతగారి అనుభవాలను మనవడు పంచుకున్నట్లు, ఈ శిలాతోరణం వద్ద విషయాలను తెలుసుకోవడం ప్రారంబిస్తే, మన ఈ జీవిత కాలం కూడా సరిపోదేమో!

Wednesday, January 09, 2013

Life of PI


By listening the title and seeing the poster, I thought the movie is like a slow movie. But after watching this movie yesterday, I scolded myself stupid, how could I miss this movie till now! While watching the movie, I felt like each frame in this movie is wallpaper. Storytelling and making of the movie is too good. I have seen a very good and touching movie after long time. Especially, the sea nature and their creatures, cyclone scenes and showing the forest as a man, are the scenes which I love the most in this movie. And finally, this movie should be watching in theater only, to feel the nature, watching in 3D will be definitely more exciting.